https://oktelugu.com/

ఫ్రీ సమ్మర్ లో నితిన్ ‘చెక్’.. అలాగే బోల్డ్ సినిమా కూడా !

హీరో నితిన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘చెక్’. చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు దర్శకుడు. ఇటీవలే సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఫిక్స్ చేసిందని తెలుస్తోంది. ఫ్రీ సమ్మర్ లో సినిమా రిలీజ్ ఉంటుందట. ఇక ఈ సినిమా కథనం మొత్తం చదరంగం ఆటను పోలి ఉంటుందని.. పాత్రల మధ్య డ్రామా అండ్ ఎత్తులు పైఎత్తులు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని.. […]

Written By:
  • admin
  • , Updated On : December 29, 2020 / 09:53 AM IST
    Follow us on


    హీరో నితిన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘చెక్’. చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు దర్శకుడు. ఇటీవలే సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఫిక్స్ చేసిందని తెలుస్తోంది. ఫ్రీ సమ్మర్ లో సినిమా రిలీజ్ ఉంటుందట. ఇక ఈ సినిమా కథనం మొత్తం చదరంగం ఆటను పోలి ఉంటుందని.. పాత్రల మధ్య డ్రామా అండ్ ఎత్తులు పైఎత్తులు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని.. అందుకే టైటిల్ కూడా చెక్ అని పెట్టారని టాక్. పైగా సినిమాలో నితిన్ డ్యుయేల్ రోల్ చేయబోతున్నాడట. ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు విలన్ తో ఎలా ఆడుకున్నారు అనేది మెయిన్ థీమ్ అట.

    Also Read: బ్రేకింగ్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు కరోనా పాజిటివ్

    పైగా యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ తో కూడిన కథలై ఉంటాయి కాబట్టి ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలోనే ఉండటం ఖాయం. ఇక నితిన్ లాస్ట్ సినిమా ‘భీష్మ’ భారి స్థాయిలో ఆకట్టుకోని సూపర్ హిట్ అవ్వడంతో నితిన్ నుండి రాబోయే సినిమాల పై భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి… ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆ సక్సెస్ ను కొనసాగించాడానికి తన తదుపరి సినిమాల పై కూడా నితిన్ చాల జాగ్రత్తలు తీసుకుని సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే నితిన్ ఆల్రెడీ పూర్తిచేసిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

    Also Read: సంక్రాంతికి టీజర్లతో రానున్న పవన్, ప్రభాస్ !

    కాగా ఈ సినిమాలో కథానయకిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక నితిన్ ఎంతో మక్కువతో చేస్తున్న చిత్రం ‘అంధాదూన్’ తెలుగు రీమేక్. మేర్లపాక గాంధీ ఈ రీమేక్ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ రీమేక్ చిత్రం షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్. అన్నట్టు ఈ చిత్రాన్ని వీలైనంతవరకూ సహజ సిద్ధమైన లొకేషన్లలోనే చిత్రీకరించాలని నితిన్ డైరెక్టర్ కు కండీషన్ పెట్టాడట. ఇక ఈ సినిమాలో కథానాయకిగా నభా నటేష్ నటించనుండగా ప్రధానమైన నెగెటివ్ పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా పోషించనుంది. తమన్నా పాత్ర చాల బోల్డ్ గా ఉండనుంది. ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పించనున్నారు. ఈ సినిమాని కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్