వంగవీటి రాధాకృష్ణ.. ఒకప్పుడు బెజవాడను గడగడలాడించిన రంగా వారసుడికి రాజకీయంగా ఇప్పుడు గడ్డుపరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన వేసిన తప్పటడుగులే ఇప్పుడు ఆయనను రాజకీయంగా ఆగం చేశాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తండ్రి రంగాను చంపిన టీడీపీలోనే గత ఎన్నికల వేళ చేరిన రాధా తీరుపై కాపు సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికి రంగా టీడీపీలో ఉండడాన్ని వారు జీర్ణించుకోవడం లేదన్న చర్చ సాగుతోంది.
Also Read: జూ. ఎన్టీఆర్ వైపు తెలుగు తమ్ముళ్ల చూపు?
వంగవీటి పార్టీల మార్పులు ఆయనకు కలిసిరాలేదు. వంగవీటి రాధా గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పని చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీలో చేరినా, జగన్ వ్యవహారశైలి నచ్చక ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ సీపీ నుంచి బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ ఎన్నికలలో పోటీ చేయలేదు. అయితే ఆయన అభిమానులు ఎప్పటి నుండో ఆయనను జనసేన లో చేరమని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు ఇవే తరహా రూమర్లు వచ్చినప్పటికీ అవి నిజ రూపం దాల్చలేదు. మరి ఈ సారి ఏమవుతుందో వేచి చూడాలి.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుడివాడ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నాని పై పవన్ వాఖ్యలతో రాధా జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: నిరుద్యోగులకు ఎల్‌అండ్‌టీ శుభవార్త.. 1100 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..!
గత సార్వత్రిక ఎన్నికల ముందు వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా టీడీపీ కండువా కప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఎక్కడా పోటీ చేయలేదు. ప్రస్తుతం రాజకీయంగా అంత యాక్టీవ్‌గా కూడా రాధా లేరు. ఎప్పుడో ఓసారి చంద్రబాబునాయుడును కలిసి చర్చించటం లేకపోతే అమరావతి రైతుల దీక్షలో మాత్రమే కనిపిస్తున్నారు. అంతే తప్ప.. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు రాధా. దీంతో.. త్వరలోనే ఆయన టీడీపీని వదిలేస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఈ ప్రచారం కొనసాగుతుండగానే.. ఒకసారి పవన్ మరోసారి మనోహర్ తో భేటీ అయ్యారు.
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ త్వరలో జనసేన పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జనసేనలో నంబర్ 2 అయిన నాడెండ్ల మనోహర్ ను విజయవాడలోని ఓ హోటల్ లో కలిసి రాధా చర్చలు జరపడం సంచలనంగా మారింది. ఇదే ఇప్పుడు ఆయన జనసేనలో చేరబోతున్నారనే ప్రచారానికి తెరతీసింది. గత ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమితో.. ఆ పార్టీలో ఉన్న నేతలు మరో పార్టీ కండువాను కప్పుకుంటున్నారు. ఏపీలో భవిష్యత్తు ప్రత్యామ్నాయంగా జనసేన కనిపిస్తుండటంతో పలువురు ఆపార్టీవైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నేత వంగవీటి రాధా జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్