తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు చెంబరతాక్సం ప్రాంతంలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పూండి, రెడ్ హిల్స్ ప్రాంతంలో వరుసగా 4, 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో స్థానికంగా ఉండే రిజర్వాయర్లు వరద నీటితో నిండుతున్నాయి. చెన్నయ్ లోని చెంబరబాక్కం, రెడ్ హిల్స్ రిజర్వాయర్ల నుంచి దాదాపు 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. చెంబరబాక్స రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 24 అడుగులు కాగా ప్రస్తుతానికి 23.37 అడుగులకు చేరింది. ఇక చోళవరంతో సహా నాలుగు ప్రధాన సరస్సులు నీటితో నిండిపోయాయి.