https://oktelugu.com/

‘అల్లు అర్జున్’ చెల్లిగా స్టార్ హీరోయిన్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయిక అంటేనే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది వీరి కాంబినేషన్ లో మొదటిసారి వైవిధ్యమైన కథతో రాబోతున్న ‘పుష్ప’ సినిమా పై ఇప్పటికే అంచనాలు అత్యున్నత స్థాయిలోకి వెళ్లకుండా ఉంటాయా ? ఇప్పటికే తారాస్థాయికి వెళ్లిపోయాయి. అయితే, తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ బన్నీకు సోదరి పాత్రలో కనిపించబోతుందట. ఇంతకీ ఆ సిస్టర్ […]

Written By:
  • admin
  • , Updated On : January 6, 2021 / 10:47 AM IST
    Follow us on


    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయిక అంటేనే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది వీరి కాంబినేషన్ లో మొదటిసారి వైవిధ్యమైన కథతో రాబోతున్న ‘పుష్ప’ సినిమా పై ఇప్పటికే అంచనాలు అత్యున్నత స్థాయిలోకి వెళ్లకుండా ఉంటాయా ? ఇప్పటికే తారాస్థాయికి వెళ్లిపోయాయి. అయితే, తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ బన్నీకు సోదరి పాత్రలో కనిపించబోతుందట. ఇంతకీ ఆ సిస్టర్ రోల్ లో నటిస్తోంది న్యాచురల్ బ్యూటీ ‘సాయి పల్లవి’ అట. వినడానికే వెరీ ఇంట్రస్టింగ్ గా ఉన్న ఈ వార్త మొత్తానికి సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.

    Also Read: టాలీవుడ్ అంతా సీక్వెల్స్ మయమే !

    నిజానికి గతంలోనే ఈ చిత్రంలో బన్నీ రోల్ కు ఓ సోదరి పాత్ర ఉంటుంది అని టాక్ వచ్చింది. కాకపోతే ‘సాయి పల్లవి’ లాంటి హీరోయిన్ ను, ఆ రోల్ కోసం తీసుకుంటారని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అయితే, సాయి పల్లవి పాత్ర ఇంటర్వల్ లో చనిపోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. ఆ పాత్రకు సాయిపల్లవి పాత్రకు మధ్య ట్రాక్ ఉంటుందని.. ఆమె చావుకి పోలీస్ నే కారణం అవుతాడని తెలుస్తోంది. ఇక విజయ్ కూడా ఆ పోలీస్ పాత్రలో నటిస్తా అని మొదట కమిట్ అయినా, కరోనా కారణంగా డేట్స్ అన్ని క్రాస్ సినిమా నుండి తప్పుకున్నాడు.

    Also Read: పాపం మళ్ళీ బుక్కయ్యాడు.. అది తన జన్మ హక్కు !

    అందుకే ఇప్పుడు ఈ పాత్రలోనే మరో తమిళ హీరో ‘ఆర్య’ను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. పైగా ఆర్య గతంలో బన్నీ వరుడు సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో మరో స్పెసల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఈ రోజు నుండి ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలుకానుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్