https://oktelugu.com/

Gautam Adani: బిల్ గేట్స్ ను దాటేసి ప్రపంచ కుబేరుల్లో 4వ స్తానానికి గౌతం అదానీ.. ఎలా సాధ్యమైంది?

Gautam Adani: గౌతమ్ అదానీ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు. మేటి దిగ్గజాలను పక్కకు నెడుతున్నారు. ఆసియాలోనే నెంబర్ వన్ కుబేరుడిగా ఖ్యాతి గడించి అదానీ మరో అరుదైన ఘనత సాధించడం విశేషం. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను దాటేసి తన సంపదను పెంచుకోవడం గమనార్హం. దీంతో భవిష్యత్ లో ఇంకా మరిన్ని రికార్డులు తిరగ రాస్తాడని తెలుస్తోంది. అపర కుబేరుడిగా అదానీ తన సంపదను పెంచుకుంటూ పోతున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా రికార్డుల మోత మోగిస్తాడని […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 20, 2022 / 04:57 PM IST
    Follow us on

    Gautam Adani: గౌతమ్ అదానీ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు. మేటి దిగ్గజాలను పక్కకు నెడుతున్నారు. ఆసియాలోనే నెంబర్ వన్ కుబేరుడిగా ఖ్యాతి గడించి అదానీ మరో అరుదైన ఘనత సాధించడం విశేషం. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను దాటేసి తన సంపదను పెంచుకోవడం గమనార్హం. దీంతో భవిష్యత్ లో ఇంకా మరిన్ని రికార్డులు తిరగ రాస్తాడని తెలుస్తోంది. అపర కుబేరుడిగా అదానీ తన సంపదను పెంచుకుంటూ పోతున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా రికార్డుల మోత మోగిస్తాడని నిపుణులు పేర్కొంటున్నారు.

    Bill Gates

    ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొనసాగుతున్నాడు. తరువాత స్థానాల్లో లూయిస్ విట్టన్ గ్రూకు చెందిన బెర్నార్డ్ అర్నాల్డ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. పోర్క్స్ జాబితా ప్రకటించిన కుబేరుల జాబితాలో అదానీ 114.4 బిలియన్ డాలర్లతో ఉండగా బిల్ గేట్స్ 102.4 బిలియన్ డాలర్లతో ఉంటున్నాడు. దీంతో అదానీ సంపాదన పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆయన ఎదుగులపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

    Bernard Arnold

    ఇప్పటికి ముకేష్ అంబానీనే ధనవంతుడిగా ఉంటున్నా కొద్ది రోజులుగా అదానీ అంబానీని దాటేసి తన సంపదను పెంచుకుంటూ పోతున్నాడు. ఈ దశలో అదానీ అత్యంత ధనవంతుడిగా ఖ్యాతి గడిస్తున్నాడు. 2022 జులై నుంచి అదానీ సంపాదన అమాంతం పెరుగుతోంది. దీంతో ఆయన నికర ఆస్తుల విలువ కూడా దూకుడు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ అదానీ తన వ్యాపారాలను ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు. ఫలితంగానే ఆయ సంపాదన అంచెలంచెలుగా తారాస్థాయికి చేరుతోంది.

    Gautam Adani

    రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నికర ఆస్తుల విలువ 88.4 బిలియన్ డాలర్లే. దీంతో అదానీ ఎప్పుడో అంబానీని దాటేశాడు. ముకేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానానికి పడిపోయాడు. అదానీ మాత్రం పెరుగుతూ పోతున్నాడు. అదానీ దశ తిరగడంతోనే ఆయన సంపాదన ఒక్కసారిగా పెరుగుతోంది. ప్రపంచంలోని కుబేరుల్లో ప్రముఖుడిగా గుర్తింపు పొందుతున్నాడు. వ్యాపారాల్లో కూడా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. తన వ్యాపార ప్రపంచంలో మేటి నగధీరుడుగా పేరు సంపాదించుకున్నాడు. ప్రపంచంలోను నాలుగో కుబేరుడిగా ఎదిగాడు.

    Mukesh Ambani

    ప్రస్తుతం అందరి దృష్టి అదానీ మీదే పడుతోంది. వ్యాపార రంగంలో అనతి కాలంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొంది తన స్థానాన్ని పెంచుకున్నాడు. బిల్ గేట్స్ లాంటి కుబేరుడిని దాటేయడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో శ్రమ కావాలి. పట్టుదల ఉండాలి. అన్ని వెరసి అదృష్టం కూడా అందలం ఎక్కించాలి. అలా మన అదానీ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి సైతం పోటీ పడగల సత్తా ఉన్నవాడే అని పలువురు కీర్తిస్తున్నారు. ఆయనలోని కృషి, పట్టుదల ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెబుతున్నారు.

    Tags