Byjus: వచ్చే ఆదాయం.. అయ్యే ఖర్చు.. ఒకే అరలో ఉండే రెండు కత్తులు లాంటివి. వీటిని ఇమడిచినప్పుడే లాభాలు వస్తాయి. ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి గనుక పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వేల కోట్లకు ఎదుగుతున్నాయు. ఆ పద్ధతిని పాటించని కంపెనీలు నిండా మునుగుతున్నాయి. ఉమ్మడి ఏపీ లో సత్యం, 2008లో లెమాన్ బ్రదర్స్ వంటి సంస్థలు నేర్పిన గుణపాఠాలు కార్పొరేట్ ప్రపంచం ఇప్పటికీ మర్చిపోదు. ప్రస్తుతం తాజా పరిస్థితికి వస్తే అదే దారిలో బైజూస్ అనే ఎడ్యుకేషన్ స్టార్ట్ అప్ సంస్థ ఉందని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకప్పుడు ఎన్నో స్టార్టప్ కంపెనీలు పెట్టే ఎంటర్ ప్రేన్యూర్లకు బైజుస్ విజయ రహస్యం ఒక పాఠం. కానీ ఇప్పుడు ఒక గుణ పాఠం.

…
ఎందుకు ఈ చెల్లింపుల సంక్షోభం
…
బైజూస్.. బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో. కరోనా సంక్షోభ కాలంలో ప్రతీ విద్యార్థికి చేరువైంది ఈ ఎడ్యుకేషన్ స్టార్ట్ అప్. కోవిడ్ సమయంలో పాఠశాలలన్నీ మూతపడటంతో ఈ సంస్థ ఆన్లైన్లో పాఠాలు బోధించింది. విద్యార్థులకు అర్థమయ్యేలా అన్ని విషయాలు వివరించింది. దీంతో బై జూస్ స్టార్ట్ అప్ విలువ మార్కెట్లో భారీగా పెరిగింది. అమెరికా నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో కంపెనీ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు పూనుకున్నాడు. బైజుస్ లాంటి 11 స్టార్ట్ అప్ కంపెనీలను కొన్నాడు. దీనికి తోడు ఆకాష్ అనే విద్యాసంస్థలను కూడా కొనుగోలు చేశాడు. కరోనా రెండేళ్లు బైజుస్ సంస్థ గణనీయమైన లాభాలను గడిచింది. ఇండియన్ క్రికెట్ టీంకు స్పాన్సర్షిప్ చేసే స్థాయికి ఎదిగింది. కరోనా అనంతరం ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో బైజుస్ యాప్ ను రెన్యువల్ చేసుకోవడానికి విద్యార్థులు ఇష్టపడటం లేదు. తరగతులు కూడా ప్రారంభం కావడంతో పెద్దపెద్ద కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా బై జూస్ యాప్ ను వాటడం మానేశాయి. దీంతో ఎడ్యుకేషన్ స్టార్ట్ అప్ అయిన బైజుస్ ఆదాయం దారుణంగా పడిపోయింది. మరోవైపు అమెరికా నుంచి 2000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పిన యాజమాన్యం వాటిని దారి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొనుగోలు చేసిన కంపెనీలకు సంబంధించిన చెల్లింపుల భారం భారీగా పెరిగింది.ఇటీవల కొనుగోలు చేసిన ఆకాశ్ విద్యాసంస్థలకు చెల్లించాల్సిన బకాయి అలాగే ఉంది. దీనికి తోడు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పెట్టుబడుల సంస్థ బ్లాక్ స్టోన్ కు 200 మిలియన్ డాలర్లు బైజుస్ సంస్థ చెల్లించాల్సి ఉంది. అంత మొత్తంలో నగదు కంపెనీ వద్ద లేదని తెలుస్తోంది. ఓవైపు సంస్థలోకి వచ్చినట్టుగా చెబుతున్న పెట్టుబడులు కనిపించడం లేదు. మరోవైపు చెల్లింపులు సంక్షోభం కంపెనీని వెంటాడుతోంది. బైజుస్ దేశంలో నెంబర్ వన్ ఎడ్యుకేట్ స్టార్ట్ అప్ కంపెనీ. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. లాక్ డౌన్ సమయంలో భారీగానే లాభాలు వెనకేసింది. కానీ కరోనా తర్వాత ఆదాయం దారుణంగా పడిపోయింది.
..
ఉద్యోగులను తొలగిస్తున్నారు
…
కరోనా సమయంలో బై జూస్ పెద్ద మొత్తంలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. వేతనాలు కూడా కళ్ళు చెదిరే స్థాయిలో ఇచ్చింది. కేరళలో భారీ ఎత్తున కార్పోరేట్ ఆఫీసును నిర్మించింది. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం ఆదాయం లేక సంస్థ పూర్తిగా డీలా పడిపోయింది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులను ఉన్నపలంగా తొలగిస్తున్నది. ఉద్యోగులు ఇప్పటికే సంస్థకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం గురుకులాల విద్యార్థులకు ప్రత్యేకంగా గణితం, రసాయన శాస్త్రంలో మెలకువలు నేర్పించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది మధ్య లోనే క్యాన్సల్ అయింది. ఇక ఏపీ ప్రభుత్వం ఆ మధ్య ₹500 కోట్లతో ట్యాబ్ లు కొంటామని ఆఫర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి అంతా దుర్భరంగా ఉంది. సమయంలో ట్యాబ్ లు కొనుగోలు చేసేది అనుమానంగానే ఉంది. తీవ్ర రుణ చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొంటున్న బైజుస్ సంస్థ అప్పల కోసం వివిధ పెట్టుబడుల సంస్థలను ఆశ్రయిస్తుంది. కానీ అవి అంత ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఒకవేళ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అత్యంత విలువైన కంపెనీ నుంచి అసలు ఏమీ లేదు స్థాయికి పడిపోవడం గ్యారంటీ. ఓ మేటాస్, సత్యం, లెమన్ బ్రదర్స్, స్నాప్ డీల్ కార్పొరేట్ ప్రపంచానికి పెద్ద పెద్ద గుణపాఠాలు నేర్పిన కంపెనీలు ఇవి. ప్రస్తుతం అదే దారిలో బై జూస్ నడుస్తోంది.