Trolling On Vijay devarakonda: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ జులై 21, 2022న విడుదల కానుంది. హైదరాబాద్ లోని ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఉదయం 9:30 గంటలకు తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా చేస్తున్నారు.

దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ప్రమోషన్స్‌లో భాగంగా సుదర్శన్ థియేటర్ దగ్గర 75 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. కటౌట్ అయితే బాగానే ఉంది. కానీ, కటౌట్ లో విజయ్ డ్రాయర్ పై కనబడుతున్నాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ మాత్రం ‘అది కటౌట్ లేదు, కట్ డ్రాయర్ యాడ్ ఉందంటూ’ ట్రోల్ చేస్తున్నారు.
మొత్తానికి ఈ కట్ అవుట్ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ళ సమయాన్ని పూర్తిగా ‘లైగర్’ సినిమాకే కేటాయించాడు. పూరి కూడా ఒక సినిమా కోసం ఈ స్థాయిలో ఎప్పుడూ సమయాన్ని కేటాయించలేదు. అందుకే విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

కాగా విజయ్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ధీమాగా ఉన్నాడు. అన్నిటికీ మించి దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పైగా బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకే హిందీలో కూడా లైగర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక తెలుగు వెర్షన్ ట్రైలర్ లాంచ్ అయిపోయాక. జూలై 21, 2022న ముంబైలోని అంధేరిలోని సినీపోలిస్‌లో రాత్రి 7:30 గంటలకు ముంబై ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లో హిందీ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఇక ట్రైలర్ కు భారీ వ్యూస్ వచ్చేలా.. లైగర్ టీం ప్రమోషనల్ యాడ్స్ ను కూడా ప్లాన్ చేస్తోంది.