https://oktelugu.com/

ఇద్దరు పిల్లలతో సహా నలుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. గత నెల రోజులుగా ఏదో ఒక సంఘటనతో రాష్ట్రంలో ఆందోళన వాతావరణం నెలకొంటోంది. తాజాగా బందా జిల్లాలోని దుబన్ కా పూర్వా గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గ్రామానికి చెందిన సంగీత యాదవ్ ఇంట్లో నుంచి పొగ రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. కాగా మంటలు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 26, 2020 / 03:41 PM IST
    Follow us on

    ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. గత నెల రోజులుగా ఏదో ఒక సంఘటనతో రాష్ట్రంలో ఆందోళన వాతావరణం నెలకొంటోంది. తాజాగా బందా జిల్లాలోని దుబన్ కా పూర్వా గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గ్రామానికి చెందిన సంగీత యాదవ్ ఇంట్లో నుంచి పొగ రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. కాగా మంటలు ఆరిన తరువాత నాలుగు మ్రుతదేహాలు లభించాయని ఏఎస్పీ మహేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. వారిలో ఇద్దరు పిల్లలకు కూడా ఉన్నారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.