బ్రిటన్ లో కొత్తరకం వైరస్ కనుగొన్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది టర్కీ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రయాణానికి ముందు నెగెటివ్ రిపోర్టు తీసుకుంటేనే అనుమతిస్తామన్నారు. ప్రయాణికులు నెగెటివర్ రిపోర్టు సమర్పించినప్పటికీ వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కాగా ఇప్పటి వరకు టర్కీ దేశ వ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు.