https://oktelugu.com/

తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టకట్టేనా?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాల వల్లే ఆపార్టీ రెండుసార్లు అధికారాన్ని చేజేతుల దూరంగా చేసుకునేందనే టాక్ ప్రజల్లో బలంగా విన్పిస్తోంది. రెండుసార్లు కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైన ఆ పార్టీ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. సీనియర్లుగా చెలమణి అవుతున్న కొందరు  నేతల తీరుతోనే కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో రోజరోజుకు దిగజారిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read: అలిగినోళ్లందరికీ పార్టీ పదవులు..: అసంతృప్తులకు కాంగ్రెస్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 26, 2020 8:04 pm
    Follow us on

    Congress
    తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాల వల్లే ఆపార్టీ రెండుసార్లు అధికారాన్ని చేజేతుల దూరంగా చేసుకునేందనే టాక్ ప్రజల్లో బలంగా విన్పిస్తోంది.

    రెండుసార్లు కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైన ఆ పార్టీ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. సీనియర్లుగా చెలమణి అవుతున్న కొందరు  నేతల తీరుతోనే కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో రోజరోజుకు దిగజారిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    Also Read: అలిగినోళ్లందరికీ పార్టీ పదవులు..: అసంతృప్తులకు కాంగ్రెస్‌ బుజ్జగింపులు

    కాంగ్రెస్ నేతలకు పదవులపై ఉన్న ఆరాటం తప్ప ప్రజా సమస్యపై చిత్తశుద్ధి లేనట్లు కన్పిస్తోంది. ఎన్నికలప్పుడు హడావుడి చేయడం తప్ప కాంగ్రెస్ గత ఆరేళ్లలో అధికార పార్టీపై గట్టి పోరాటం చేసిన దాఖలాలు లేవని.. నేతల తీరుతోనే తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ మూడో స్థానానికి పడిందనే విమర్శలున్నాయి.

    టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రాజీనామాతో ఆ పదవీ దక్కించుకునేందుకు నేతలు పడుతున్నారు. అయితే కొందరు నేతలు తమకు రాకపోయినా పర్వాలేదుగానీ రేవంత్ రెడ్డికి పీసీసీ దక్కొద్దు అనేలా ప్రవర్తిస్తుండటం కాంగ్రెస్ లోనే చర్చనీయాంశంగా మారింది.

    సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మాజీ ఎంపీ వీ.హన్మంతు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పీసీసీ చీఫ్ పదవీ రేవంత్ కు ఖాయమైందనే ప్రచారం జరుగుతుండటంతో వీరిద్దరు అధిష్టానంపై ధిక్కారస్వరం విన్పిస్తున్నారు.

    Also Read: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?

    కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే పీసీసీగా ఎవరు నియామకమైన మరోవర్గం వ్యతిరేకించేలా కన్పిస్తోంది. దీంతో కాంగ్రెస్ లో ఎవరు పీసీసీ అయినా ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతాయని స్పష్టమవుతోంది.

    అధిష్టానం అసంతృప్తులను ఎంత బుజ్జగిస్తున్నా కాంగ్రెస్ పై సీనియర్లు ధిక్కారస్వరం విన్పిస్తుండం శోచనీయంగా మారింది. కాంగ్రెస్ నేతల తీరుచూస్తుంటే వచ్చే ఎన్నికల వాటికైనా కాంగ్రెస్ బ్రతికిబట్ట కడుతుందా? అన్న అనుమానాలు కలుగక మానదు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్