కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూటా సింగ్ మరణించారు. పంజాబ్ కు చెందిన బూటా సింగ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. బూటాసింగ్ నెహ్రు-గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా ఉండేవారు. పంజాబ్ నుంచి 8 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో హోంశాఖ, వ్యవసాయ, రైల్వే, క్రీడల శాఖలకు మంత్రిగా పనిచేశారు. అలాగే బీహార్ గవర్నర్ గా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కూడా నియమితులయ్యారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ‘బూటాసింగ్ జీ పేదల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల వారి కోసం ఎంతో క్రుషి చేశారు. ఆయన మరణంపై బాధగా ఉంది. ఆయన కుటుంబానికి నా సంతాపం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.