మినీ ‘పుర పోరు’కు సై అంటున్న ఎన్నికల కమిషన్.. పార్టీలు సిద్ధమేనా..?

2021 సంవత్సరం అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ విసురుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మారిపోయాయి. టీఆర్ఎస్.. బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీలకు తోడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లురుతోంది. Also Read: కేసీఆర్‌‌ను నమ్మేది లేదు.. ఆయనది వన్‌ సైడ్‌ లవ్‌ ఇక త్వరలోనే వరంగల్-ఖమ్మం-నల్గొండ.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు.. నాగార్జున్ ఉప […]

Written By: Neelambaram, Updated On : January 2, 2021 12:00 pm
Follow us on

2021 సంవత్సరం అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ విసురుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మారిపోయాయి. టీఆర్ఎస్.. బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీలకు తోడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లురుతోంది.

Also Read: కేసీఆర్‌‌ను నమ్మేది లేదు.. ఆయనది వన్‌ సైడ్‌ లవ్‌

ఇక త్వరలోనే వరంగల్-ఖమ్మం-నల్గొండ.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు.. నాగార్జున్ ఉప ఎన్నిక జరుగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలపై ఎన్నికలకు ముందుస్తుగానే సిద్ధమవుతున్నాయి.

గ్రేటర్ వరంగల్.. ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికలతోపాటు మరో ఐదు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఎన్నికల ఏర్పాట్లు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది.

తెలంగాణ మున్సిపల్‌ చట్టం-2019 ప్రకారంగా.. పురపాలికల పాలకవర్గాల గడువు ముగియడానికి మూడు నెలల ముందు నుంచే తదుపరి ఎన్నికల నిర్వహణకు కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు త్వరలో గడువు ముగియనున్న ఏడు మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది.

Also Read: కేసీఆర్‌‌ను నమ్మేది లేదు.. ఆయనది వన్‌ సైడ్‌ లవ్‌

గ్రేటర్‌ వరంగల్.. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్.. అచ్చంపేట(నాగర్‌కర్నూల్‌) మున్సిపాలిటీల పాలకవర్గం గడువు మార్చి 14తో.. సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్‌ 15తో ముగియనుంది. వీటితోపాటు కొత్తగా గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయిన నకిరేకల్‌ (నల్లగొండ).. జడ్చర్ల(మహబూబ్‌నగర్‌).. కొత్తూరు(రంగారెడ్డి)లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికను ప్రభుత్వం మార్చిలోగా నిర్వహించాలని భావిస్తోంది. దీంతో ఈ ఏడు పురపాలికల ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించే అవకాశం ఉండే అవకాశం కన్పిస్తుంది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్