https://oktelugu.com/

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అరెస్టు

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ గాయకుడు గురు రంధ్వాను కూడా అరెస్టు చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలోని ముంబై డ్రాగన్ ఫ్లై క్లబ్ పై పోలీసులు దాడి చేశారు. ఈ క్లబ్ లో సురేశ్ రైనా, గాయకుడు రంధ్వా అక్కడే ఉన్నారు. దీంతో కరోనా వైరస్ నిబంధనలకు విరుద్ధంగా వారు పార్టీలో పాల్గొన్నందుకు పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనంతరం వారు బెయిల్ పై విడుదలయ్యారు. కరోనా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 22, 2020 / 01:12 PM IST
    Follow us on

    టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ గాయకుడు గురు రంధ్వాను కూడా అరెస్టు చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలోని ముంబై డ్రాగన్ ఫ్లై క్లబ్ పై పోలీసులు దాడి చేశారు. ఈ క్లబ్ లో సురేశ్ రైనా, గాయకుడు రంధ్వా అక్కడే ఉన్నారు. దీంతో కరోనా వైరస్ నిబంధనలకు విరుద్ధంగా వారు పార్టీలో పాల్గొన్నందుకు పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనంతరం వారు బెయిల్ పై విడుదలయ్యారు. కరోనా నేపథ్యలో మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవద్దని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.