మధ్యప్రదేశ్ లోని జైన ఆలయంలో పూజ చేస్తూ ఓ మాజీ ఎమ్మెల్యే అక్కడే కుప్పకూలాడు. ఆ తరువాత ఆలయ సిబ్బంది అతడిని లేపే సరికి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మధ్యప్రదేశ్ లోని బైతూల్ కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వినోద్ డాగా ప్రతీరోజు ఉదయం స్థానిక జైన ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఎప్పటిలాగానే ఈనెల 12న కూడా జైన ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. అక్కడి పార్శనాథుడి మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తరువాత స్వామి వారి పాదాలపై తలను ఆనించాడు. ఆ తరువాత ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇటీవల మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో వినోద్ డాగా కు కాంగ్రెస్ పార్టీ మెహ్ గావ్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. మరణానికి ఒకరోజు ముందు భోపాల్ లో పార్టీ సమావేశంలోనూ పాల్గొన్నారు.