https://oktelugu.com/

చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖపై విచారణ.. నేడు ఏం జరుగనుంది?

తాను చేస్తున్న ప్రతీ పనికీ రాష్ట్రంలోని హైకోర్టు అడ్డుపడుతోందని.. ఈ తీర్పుల వెనుక సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉన్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చీఫ్‌ జస్టిస్ బాబ్డేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. హైకోర్టులోని మరికొందరు న్యాయమూర్తులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ప్రధాన ఆరోపణ. అయితే.. లేఖ రాయడం వరకే జగన్‌ ఊరుకోలేదు.. దానిని బహిరంగ పర్చారు కూడా. దీంతో ఈ వ్యవహారం కాస్త హాట్‌ టాపిక్‌ అయింది. Also Read: రాజాధిరాజా: జగన్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 10:25 AM IST
    Follow us on

    తాను చేస్తున్న ప్రతీ పనికీ రాష్ట్రంలోని హైకోర్టు అడ్డుపడుతోందని.. ఈ తీర్పుల వెనుక సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉన్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చీఫ్‌ జస్టిస్ బాబ్డేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. హైకోర్టులోని మరికొందరు న్యాయమూర్తులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ప్రధాన ఆరోపణ. అయితే.. లేఖ రాయడం వరకే జగన్‌ ఊరుకోలేదు.. దానిని బహిరంగ పర్చారు కూడా. దీంతో ఈ వ్యవహారం కాస్త హాట్‌ టాపిక్‌ అయింది.

    Also Read: రాజాధిరాజా: జగన్‌ ఆస్థానంలో రాజగురువు!?

    న్యాయ వ్యవస్థపై జగన్‌ చేసిన ఆరోపణలు మామూలివి కావని.. అది ప్రజాస్వామ్యానికే కళంకితమని ఎక్కడికక్కడ బార్‌‌ అసోసియేషన్లు ఫైర్‌‌ అయ్యారు. మరోవైపు జగన్‌ను దోషిగా నిర్ధారిస్తూ పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఇవాళ విచారణకు రాబోతున్నాయి. సుప్రీంకోర్టులోని మూడు నంబర్‌ కోర్టులో జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిని విచారించబోతోంది.

    లేఖను సీరియస్‌గా తీసుకొని జగన్‌ను పదవి నుంచి తప్పించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు తమ పిటిషన్‌లో కోరారు. దీంతో సుప్రీం కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చింది. దీంతోపాటు లాయర్లు సునీల్‌ నారాయణ్‌సింగ్, అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్లపైనా సుప్రీంకోర్టు విచారణ జరుపుతుందా లేక ఈ పిల్‌ ఒక్కటే విచారిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

    Also Read: విద్యార్థులకు శుభవార్త.. వెబ్ సైట్ ద్వారా కెరీర్ ను ఎంచుకునే ఛాన్స్..?

    మరోవైపు వైసీపీ బహిష్కృత ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా వీలు దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా.. సుప్రీం కోర్టులో విచారణకు రానున్న ఈ పిటిషన్లపైనా స్పందించారు. సుప్రీం కోర్టు నుంచి తీవ్రమైన ఆదేశాలు వచ్చే అవకాశముందంటూ చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ రావడం ఖాయమని, ఆయన పదవి కోల్పోయే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఆయా పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోతోందన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయ నడుస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్