https://oktelugu.com/

‘బిగ్ బాస్’నే ఇరుకున పెడుతున్న కంటెస్టెంట్లు..!

‘బిగ్ బాస్‘కు తెలుగులో నెంబర్ వన్ షోగా పేరుంది. ప్రస్తుతం కొనసాగుతున్న బిగ్ బాస్-4 చివరి దశకు చేరుకుంటుండటంతో గేమ్ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే పది వారాలను పూర్తి చేసుకున్న ‘బిగ్ బాస్-4’ 11వ వారంలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుత సీజన్లోని కంటెస్టులంతా ‘బిగ్ బాస్’ను ఫుల్లుగా స్టడీ చేసి వచ్చినట్లు అర్థమవుతోంది. Also Read: సమంత సామ్-జామ్..అన్ని కలిపేసి కిచిడిలా మారిందా? బిగ్ బాస్ షోలో లోపల ఉన్న కంటెస్టులకు బయట ఏం జరుగుతుందనేది సాధారణంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 10:20 AM IST
    Follow us on

    ‘బిగ్ బాస్‘కు తెలుగులో నెంబర్ వన్ షోగా పేరుంది. ప్రస్తుతం కొనసాగుతున్న బిగ్ బాస్-4 చివరి దశకు చేరుకుంటుండటంతో గేమ్ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే పది వారాలను పూర్తి చేసుకున్న ‘బిగ్ బాస్-4’ 11వ వారంలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుత సీజన్లోని కంటెస్టులంతా ‘బిగ్ బాస్’ను ఫుల్లుగా స్టడీ చేసి వచ్చినట్లు అర్థమవుతోంది.

    Also Read: సమంత సామ్-జామ్..అన్ని కలిపేసి కిచిడిలా మారిందా?

    బిగ్ బాస్ షోలో లోపల ఉన్న కంటెస్టులకు బయట ఏం జరుగుతుందనేది సాధారణంగా తెలియదు. అయితే చాలామంది కంటెస్టెంట్స్ మాత్రం ఏది చేస్తే బిగ్ బాస్ తమను హైలెట్ చేసి ప్రేక్షకులకు చూపిస్తాడనేది అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కంటెస్టెంట్లు కెమెరా ముందు ఒకలా మిగతా సమయాల్లో మరోలా నటిస్తున్నారు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారనే టాక్ విన్పిస్తోంది.

    ఇటీవల బిగ్ బాస్ రాత్రికి రాత్రి ఓ కంటెస్టెంట్ ను బయటికి పంపించాలని సూచించారు. ప్రేక్షకుల తీర్పుతో సంబంధం లేకుండా కంటెస్టెంట్ ను బయటికి పంపారనే ముందుగానే తెలుసుకున్న కంటెస్టులు మాత్రం ఆస్కార్ రేంజ్లో నటించారు. ఇది సీక్రెట్ రూమ్ కు పంపించే విషయమని తెలుసుకొని అందుకనుగుణంగా ఫార్మమెన్స్ చేయడంతో బిగ్ బాస్ అవాక్కయ్యాడు.

    Also Read:అఖిల్ ఎలిమినేషన్.. మరోసారి దొరికిన బిగ్ బాస్

    అయితే గత సీజన్లో బిగ్ బాస్ ఏది ప్లాన్ చేసిన కంటెస్టెంట్స్.. ప్రేక్షకుల్లో ఓ సస్పెన్స్ ఉండేది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్-4లో పాల్గొన్న కంటెస్టెంట్లు ముందుగానే అన్ని భాషల్లో నడుస్తున్న బిగ్ బాస్ కార్యక్రమాలను చూసి ఓ పక్కా ప్రణాళికతో గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఏం చేసిన కంటెస్టెంట్స్ మాత్రం ముందుగానే పసిగడుతున్నారు. దీంతో రియల్టీ గేమ్ కాస్తా డ్రామాను తలపిస్తోంది. బిగ్ బాస్ వీళ్లకంటే ముదురుగా ఆలోచిస్తే తప్ప గేమ్ ఆసక్తికరంగా మారేలా కన్పించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.