https://oktelugu.com/

డ్రగ్స్‌ కేసు: వివేక్‌ ఒబేరాయ్‌ ఇంట్లో సోదాలు..

డ్రగ్స్‌ కేసు వ్యవహారం బాలీవుడ్‌ నటులను నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే రియా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కంగనా, దీపీకా పదుకునే లాంటి వారు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ కూడా ఈ కేసు చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. గురువారం వివేక్‌ ఒబేరాయ్‌ ఇంట్లో బెంగళూర్‌ పోలీసులు సోదాలు జరిపారు. వివేక్‌ బంధువు ఆదిత్య అల్వాకి డ్రగ్స్‌కి కేసులో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన కోసం గాలింపు చేపట్టామని […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 15, 2020 / 03:19 PM IST
    Follow us on

    డ్రగ్స్‌ కేసు వ్యవహారం బాలీవుడ్‌ నటులను నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే రియా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కంగనా, దీపీకా పదుకునే లాంటి వారు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ కూడా ఈ కేసు చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. గురువారం వివేక్‌ ఒబేరాయ్‌ ఇంట్లో బెంగళూర్‌ పోలీసులు సోదాలు జరిపారు. వివేక్‌ బంధువు ఆదిత్య అల్వాకి డ్రగ్స్‌కి కేసులో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన కోసం గాలింపు చేపట్టామని బెంగుళూరు జాయింట్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ పేర్కొన్నారు. ఆదిత్య అల్వా కర్ణాటక మాజీ మంత్రి కుమారుడు కాగా.. శాండల్‌వుడ్‌ డ్రగ్‌ కేసులో ఆయన హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.