https://oktelugu.com/

ఇక ముంబై వంతు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని హైదరాబాద్‌ అతలాకుతలమైంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీటిలోనే మునిగి ఉన్నాయి. తాజాగా ముంబైలోనూ ఇదే తరహాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు గురువారం హెచ్చరించారు. ముంబైతో పాటు థానే, పూణే, షోలాపూర్‌, ఉత్తర కొంకణ్‌ ప్రాంతలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కురిసిన వర్షాలకు పూణే జిల్లా నింగాన్‌ కేట్కీ గ్రామంలో వరదనీటిలో చికుక్కుకున్న 40 మందిని సహాయ సిబ్బంది […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 15, 2020 / 03:28 PM IST
    Follow us on

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని హైదరాబాద్‌ అతలాకుతలమైంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీటిలోనే మునిగి ఉన్నాయి. తాజాగా ముంబైలోనూ ఇదే తరహాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు గురువారం హెచ్చరించారు. ముంబైతో పాటు థానే, పూణే, షోలాపూర్‌, ఉత్తర కొంకణ్‌ ప్రాంతలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కురిసిన వర్షాలకు పూణే జిల్లా నింగాన్‌ కేట్కీ గ్రామంలో వరదనీటిలో చికుక్కుకున్న 40 మందిని సహాయ సిబ్బంది కాపాడారు..