https://oktelugu.com/

గాలి తక్కువగా ఉండే ప్రదేశాల్లో బాణసంచా వద్దు: ఎన్ జీటీ

దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ప్రకటించారు. ఈనెల 9 అర్ధరాత్రి నుంచి 30 వరకు ఎక్కడా టపాసుల అమ్మకం గాని, వినియోగం గాని చేయకూడదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తెలిపింది. అంతేకాకుడా గాలిలో నాణ్యత తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇలాంటి నిబంధనలు వర్తిస్తాయని ట్రైబ్యునల్ చైర్ పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ నేత్రత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సాధారణ ప్రదేశాల్లో హరిత పటాకలు మాత్రమే విక్రయించాలని తెలిపింది. దీపావళి, క్రిస్మస్, నూతన […]

Written By: , Updated On : November 9, 2020 / 01:52 PM IST
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ప్రకటించారు. ఈనెల 9 అర్ధరాత్రి నుంచి 30 వరకు ఎక్కడా టపాసుల అమ్మకం గాని, వినియోగం గాని చేయకూడదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తెలిపింది. అంతేకాకుడా గాలిలో నాణ్యత తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇలాంటి నిబంధనలు వర్తిస్తాయని ట్రైబ్యునల్ చైర్ పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ నేత్రత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సాధారణ ప్రదేశాల్లో హరిత పటాకలు మాత్రమే విక్రయించాలని తెలిపింది. దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో బాణసంచా కాల్చుకునేందుకు రెండు గంటలు మాత్రమే అనుమతించాలని ఆయా ప్రభుత్వాలకు తెలిపింది. వాయు కాలుష్య నియత్రణకు రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఎన్ జీటీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత శీతాకాలం సమయంలో కోవిడ్ విస్తరించే అవకాశం ఉన్నందున ప్రజలకు సరైన సూచనలు ఇవ్వాలని తెలిపింది.