దీపావళి పండుగ జరుపుకునే వారికి అలర్ట్.. వాటిపై నిషేధం..?

సాధారణంగా దీపావళి పండుగ అంటే బాణసంచాకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పండగ రోజున బాణసంచా కాలుస్తారు. దేశంలో రోజురోజుకు కాలుష్య స్థాయిలు పెరిగిపోవడం, బాణసంచా వల్ల కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉండటంతో పలు రాష్ట్రాలు టపాసులు పేల్చడంపై బ్యాన్ విధించాయి. బాణసంచాల విషయంలో దేశంలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ హరిత ట్రైబ్యునల్ బాణసంచాల విక్రయాలు, కాల్చడం గురించి కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్న […]

Written By: Navya, Updated On : November 9, 2020 1:54 pm
Follow us on


సాధారణంగా దీపావళి పండుగ అంటే బాణసంచాకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పండగ రోజున బాణసంచా కాలుస్తారు. దేశంలో రోజురోజుకు కాలుష్య స్థాయిలు పెరిగిపోవడం, బాణసంచా వల్ల కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉండటంతో పలు రాష్ట్రాలు టపాసులు పేల్చడంపై బ్యాన్ విధించాయి. బాణసంచాల విషయంలో దేశంలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జాతీయ హరిత ట్రైబ్యునల్ బాణసంచాల విక్రయాలు, కాల్చడం గురించి కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఈ నెల 30 వరకు బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధించింది. ఈరోజు అర్ధరాత్రి ఈ నిబంధనలు అమలులోకి రానుండగా బాణసంచా విక్రయించే వారిపై ఈ నిర్ణయం ప్రభావం తీవ్రంగా పడనుంది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

గాలి నాణ్యత బాగానే ఉన్న నగరాల్లో మాత్రం గ్రీన్ క్రాకర్స్ ను విక్రయించడానికి ఎన్జీటీ అనుమతులు ఇచ్చింది. ఎన్జీటీ నుంచి 23 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు బాణసంచాల విక్రయాలు, కాల్చటం గురించి నోటీసులు జారీ అయ్యాయి. ధర్మాసనం వాయుకాలుష్యంపై నిపుణుల అభిప్రాయం తీసుకోవడంతో పాటు వాయుకాలుష్యం వల్ల వైరస్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది.

ఇప్పటికే పలు రాష్ట్రాలు బాణసంచాను కాల్చడంపై నిషేధం విధించగా ఆ రాష్ట్రాలకు మాత్రం ఎన్జీటీ నుంచి నోటీసులు జారీ కాలేదు. బాణసంచా పిల్లలు, వృద్ధులతో పాటు అనారోగ్యంతో బాధ పడే వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది.