https://oktelugu.com/

గ్యారంటీ లేకుండా రూ.5 లక్షల రుణం.. ఎలా పొందాలంటే..?

ఈ మధ్య కాలంలో 10,000 రూపాయల రుణం కావాలన్నా ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది. బ్యాంకుల నుంచి మైక్రో ఫైనాన్స్ సంస్థల వరకు గ్యారంటీ ఉంటే మాత్రమే రుణాన్ని ఇస్తున్నాయి. అయితే పేటీఎం మాత్రం సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎలాంటి గ్యారంటీ లేకుండా ఏకంగా 5 లక్షల రూపాయల రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు సులువుగా ఈ రుణాలను పొందవచ్చు. ప్రస్తుతం సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మాత్రమే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 9, 2020 1:33 pm
    Follow us on


    ఈ మధ్య కాలంలో 10,000 రూపాయల రుణం కావాలన్నా ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది. బ్యాంకుల నుంచి మైక్రో ఫైనాన్స్ సంస్థల వరకు గ్యారంటీ ఉంటే మాత్రమే రుణాన్ని ఇస్తున్నాయి. అయితే పేటీఎం మాత్రం సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎలాంటి గ్యారంటీ లేకుండా ఏకంగా 5 లక్షల రూపాయల రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు సులువుగా ఈ రుణాలను పొందవచ్చు.

    ప్రస్తుతం సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మాత్రమే ఈ రుణాలను ఇవ్వనున్నట్టు పేటీఎం సంస్థ వెల్లడించింది. వ్యాపారులకు పేటీఎం ఈ రుణాలను అతి తక్కువ వడ్డీకే ఇస్తుండటం గమనార్హం. కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారులకు పేటీఎం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది. డైలీ ఈఎంఐ ప్రొడక్టులను సైతం తమ కంపెనీ అందుబాటులోకి తెచ్చిందని.. వీటి వల్ల చిరువ్యాపారులకు ప్రయోజనం చేకూరనుందని పేటీఎం తెలిపింది.

    1,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడానికి పేటీఎం సిద్ధమవుతూ ఉండటం వల్ల వ్యాపారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే డిజిటల్ లావాదేవీల ద్వారా వేర్వేరు రకాల డిజిటల్ పేమెంట్ సేవలను అందిస్తున్న పేటీఎం పర్సన్ 2 మర్చంట్ విభాగంలో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాతో దూసుకెళుతోంది. పేటీయం సేవలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

    పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ సహాయంలో సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారాలు చేస్తున్న వాళ్లు సులభంగా ఈ రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 5 లక్షల రూపాయల వరకు తనఖా లేకుండా రుణాలను ఇస్తున్నట్టు పేటీఎం సంస్థ వెల్లడించింది.