బొగ్గు గనుల కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. మరో ఇద్దరు దోషులకు కూడా మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరినామా విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. 1999లో అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలోజార్ఖండ్‌లో బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేపట్టింది. ఆ సమయంలో దిలీప్ రే బొగ్గుగనుల సహాయ మంత్రిగా ఉన్నారు.ఈనెల 6న మాజీ మంత్రి దిలీప్ రేను దోషిగా తేల్చిన కోర్టు సోమవారం జైలు శిక్ష ఖరారు చేసింది.