Homeఅత్యంత ప్రజాదరణట్రైలర్ టాక్: ‘ఆకాశం నీ హద్దురా’.. విమాన ప్రయాణం చేరువైందిలా?

ట్రైలర్ టాక్: ‘ఆకాశం నీ హద్దురా’.. విమాన ప్రయాణం చేరువైందిలా?

చిత్రవిచిత్రమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచి సూపర్ హిట్లు అందుకునే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. తమిళంలో ‘సురారై పొట్రు’ అనే చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు ‘కెప్టెన్ గోపీనాథ్’ జీవితంలో జరిగిన యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

కరోనా కారణంగా థియేటర్స్ మూతపడి ఉండడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 30న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

తాజాగా చిత్రం ట్రైలర్ విడుదలైంది. సూర్య ఈ చిత్రంలో గోపీనాథ్ పాత్రలో సామాన్యులకు విమాన ప్రయాణం ఎలా చేరువ చేశాడన్నది ప్రధాన కథ. వ్యవసాయం చేసే వాడిని విమానం ఎక్కిస్తాను అన్న సూర్య డైలాగ్ ను బట్టి ఇది సామాన్యులకు విమాన ప్రయాణం ఎలా చేరువ చేయడానికి హీరో సంకల్పించాడు.. ఆ కష్టాలు ట్రైలర్ లో కనిపించాయి. తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని సూర్య ఎలా సక్సెస్ సాధించాడన్నది అసలు కథ.

ఈ ట్రైలర్ చూస్తే సూర్య మరోసారి మెస్మరైజ్ చేస్తున్నాడని అర్థమవుతోంది. సూర్యకు జోడిగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, జాకీ ష్రాఫ్, పరేశ్ రావల్, ఉర్వశి కీలక పాత్రలు పోషించారు. సూర్య, గునీత్ మోంగా నిర్మించారు. నవంబర్ 12న ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు.

ట్రైలర్ ఇదీ

Aakaasam Nee Haddhu Ra ! - Official Trailer | Suriya, Aparna | Sudha Kongara | Amazon Original Movie

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

1 COMMENT

Comments are closed.

Exit mobile version