https://oktelugu.com/

రైతులకు మద్దతుగా డీఐజీ రాజీనామా

వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రైతులకు మద్దతుగా పలువురు సెలబ్రెబీలు తమ అవార్డులు వదులుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు తమ పదవులు విడిచిపెట్టారు. తాజాగా పంజాబ్ జైళ్ల శాఖ డీఐజీ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను హోంశాఖ కార్యదర్శకి పంపించారు. రాజీనామా చేసిన విషయాన్ని ఐడీజీపీ పీకే సిన్హా ధ్రువీకరించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో దేశంలోని రైతులు కలత చెందుతున్నారని, వారికి బాసటగా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 13, 2020 / 03:01 PM IST
    Follow us on

    వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రైతులకు మద్దతుగా పలువురు సెలబ్రెబీలు తమ అవార్డులు వదులుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు తమ పదవులు విడిచిపెట్టారు. తాజాగా పంజాబ్ జైళ్ల శాఖ డీఐజీ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను హోంశాఖ కార్యదర్శకి పంపించారు. రాజీనామా చేసిన విషయాన్ని ఐడీజీపీ పీకే సిన్హా ధ్రువీకరించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో దేశంలోని రైతులు కలత చెందుతున్నారని, వారికి బాసటగా నిలిచేందుకే డీఐజీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు లక్మీందర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.