Ustaad Bhagat Singh vs Dhurandhar 2: సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజు రిలీజ్ అయ్యే సినిమాల మధ్య పోటీ ఉంటుంది. ఏ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తుంది. ఏ సినిమా డీలా పడిపోతుంది అనే విషయంలో ఎవరికి వాళ్ళు ఒక అంచనాలో ఉంటారు. మొత్తానికైతే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలాగే రన్వీర్ సింగ్ హీరోగా చేస్తున్న ‘దురంధర్ 2’ సినిమాలు సైతం ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి.
ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాయి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది… హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చేసిన గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అందుకే ఇప్పుడు చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద కూడా భారీ బజ్ ఉంది. ఇక ఆ బజ్ ను వాడుకొని ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ఇండియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న టాప్ 3 డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?
ఈ సినిమా విషయానికి వస్తే గత సంవత్సరం వచ్చిన దురంధర్ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ప్రేక్షకులందరు ‘దురంధర్ 2’ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద భారీ బజ్ వస్తుంది. కాబట్టి భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతుందనే అంచనాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో మరోసారి చూపిస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికైతే తెలుగులో ‘దురంధర్ 2’ సినిమా కంటే కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి ఆదరణ ఎక్కువగా దక్కుతుంది… ఈ సినిమా సైతం పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడం పక్క అంటూ పవర్ స్టార్ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు… 19 వ తేదీ వస్తె గాని ఈ రెండు సినిమాల్లో ఏ మూవీకి ఎక్కువ ఆదరణ దక్కుతుందనే విషయంలో ఒక క్లారిటి రాదు…