త్రివిక్రమ్ చేతుల్లోకి ‘రామాయణం’ !

నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి 1500 కోట్ల భారీ బడ్జెట్ తో “రామాయణం ” మూవీని ఇప్పటి కాలానికి అనుగుణంగా నిర్మించబోతున్నారని అందరికి తెలిసిన సంగతే. కాగా ఈ చిత్రాన్ని ‘ప్రైమ్ ఫోకస్‌’తో కలిసి ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, క్రేజీ కాంబినేషన్ లో టాలీవుడ్ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఇది ఒకటిగా నిలవబోతున్నట్లుగా సమాచారం. ‘రామాయణం’ లో […]

Written By: admin, Updated On : December 13, 2020 3:14 pm
Follow us on


నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి 1500 కోట్ల భారీ బడ్జెట్ తో “రామాయణం ” మూవీని ఇప్పటి కాలానికి అనుగుణంగా నిర్మించబోతున్నారని అందరికి తెలిసిన సంగతే. కాగా ఈ చిత్రాన్ని ‘ప్రైమ్ ఫోకస్‌’తో కలిసి ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, క్రేజీ కాంబినేషన్ లో టాలీవుడ్ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఇది ఒకటిగా నిలవబోతున్నట్లుగా సమాచారం. ‘రామాయణం’ లో నటించబోయే నటినటులు ఇంకా ఖరారు కాలేదు. మూడు భాగాలుగా చేయబోతున్న ఈ చిత్రంలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు నటించనున్నారని సమాచారం. పాన్ ఇండియాతో పాటు ప్రపంచ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ మూవీని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

Also Read: పుష్ప కోసం రంగస్థలం టెక్నిక్

ఈ భారీ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా చకచకా జరిగిపోతున్నాయట. వర్క్ అంతా పూర్తి చేసి షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన తర్వాత అధికారకంగా ప్రకటన చెయ్యాలని అల్లు అరవింద్ ప్లాన్ చేశారట. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మన టాలీవుడ్ మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడట . ఇప్పటికే దాదాపుగా డైలాగులు తో సహా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలిసింది. అన్ని భాషలలోనూ ఈ స్క్రిప్ట్ తోనే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ప్రొసీడ్ అవుతారట. మన మాటల మాంత్రికుడు అద్భుతంగా రాసి అరవింద్ గారి చేతుల్లో పెట్టేసాడట. ఇక మిగిలిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నిటినీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి చేసి ఈ మూవీని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అరవింద్ గారు ఆలోచనలో ఉన్నారట.

Also Read: ‘దుర్గమతి’ బాక్సాపీస్ వద్ద చేతులు ఎత్తేసింది !

ఈ భారీ ఫ్రాంచైజ్ మొదటి భాగం 2022 లో విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయట. మరో విశేషమేమిటంటే ఈ మూవీ 3డి లో నిర్మించబడుతుంది. దంగల్ మూవీకి దర్శకత్వం వహించిన నితేష్ తివారీ, శ్రీదేవి నటించిన ‘మామ్’ కి దర్శకత్వం వహించిన రవి ఉద్యోవర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం చేస్తున్నట్లు సమాచారం. మేకర్స్ కి నటి నటుల ఎంపికనే పెద్ద సవాల్ గా ఉండనుంది. ముందెన్నడూ చూడని కాంబినేషన్ ని సెట్ చేసి ఈ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని నిర్మాతలు తాపత్రయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్