దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు. శనివారం కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగాఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న డ్రైరన్ ను కేంద్రమంత్రి హర్షవర్దన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వీడాలన్నారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రజల ఆరోగ్యం కోసమేనన్నారు. భద్రత, సమర్థత, రోగనిరోధక శక్తి పెంపుపై రాజీ పడేది లేదన్నారు. ఇంతకుముందు ఢిల్లీ ప్రజలకే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పామని, ఇప్పుడు దేశప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్నారు. వ్యాక్సిన్ పంపిణీపై వైద్య బ్రుందం ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని త్వరలో మిగతావారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామన్నారు. 1994లో పల్స్ పోలియో డ్రైవ్ విజయవంతం చేసినట్లుగానే కరోనా వ్యాక్సిన్ ను సక్సెస్ చేయాలని అధికారులకు సూచించారు.
#WATCH | Not just in Delhi, it will be free across the country: Union Health Minister Dr Harsh Vardhan on being asked if COVID-19 vaccine will be provided free of cost pic.twitter.com/xuN7gmiF8S
— ANI (@ANI) January 2, 2021