https://oktelugu.com/

రామతీర్థంలో టెన్షన్..టెన్షన్..: పోటాపోటీగా పర్యటనలు

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయంలపై దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేపింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇద్దరూ శనివారం పర్యటించడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడి ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు టెంట్లు వేసుకొని నినాదాలు చేస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ సైతం ఇక్కడే మకాం వేయడం రాజకీయండా వేడివాతావరణం సంతరించుకుంది. కాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బోడికొండకు చేరుకొని మెట్ల […]

Written By: , Updated On : January 2, 2021 / 01:31 PM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయంలపై దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేపింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇద్దరూ శనివారం పర్యటించడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడి ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు టెంట్లు వేసుకొని నినాదాలు చేస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ సైతం ఇక్కడే మకాం వేయడం రాజకీయండా వేడివాతావరణం సంతరించుకుంది. కాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బోడికొండకు చేరుకొని మెట్ల మార్గం ద్వరా కొండపైకి చేరుకున్నారు. మరో అరగంటలో చంద్రబాబు కూడా ఇక్కడికి రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తుతో సిద్ధంగా ఉన్నారు.