https://oktelugu.com/

14 కోట్ల మందికి కరోనా పరీక్షలు

దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ వైరస్‌ నిర్ధరణ కోసం పరీక్షలు భారీగానే చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నవంబరు 30 నాటికి 14 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకూ 14,13,49,298 పరీక్షలు చేసినట్లు తెలిపింది. నవంబరు 21వ తేదీకి 13 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య తొమ్మిది రోజుల్లోనే గణనీయంగా పెరిగింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రెండో, మూడో వేవ్‌ […]

Written By: , Updated On : December 1, 2020 / 03:40 PM IST
corona-tests-telangana
Follow us on

corona-tests-telangana

దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ వైరస్‌ నిర్ధరణ కోసం పరీక్షలు భారీగానే చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నవంబరు 30 నాటికి 14 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకూ 14,13,49,298 పరీక్షలు చేసినట్లు తెలిపింది. నవంబరు 21వ తేదీకి 13 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య తొమ్మిది రోజుల్లోనే గణనీయంగా పెరిగింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రెండో, మూడో వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచాయి.