https://oktelugu.com/

జగన్ కు సుప్రీంలో ఊరట

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తన పదవి నుంచి తొలగించాలని సుప్రీంలోవేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. మంగళవారం జీఎస్మణి దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన జస్టిస్ సంజయ్ కౌల్ పిటిషనర్ కోరుతున్న డిమాండ్ సహేతుకంగా లేదని చెప్పారు. పిటిషన్ లో లేవనెత్తిన అంశాలు సరిగ్గా లేవని పరస్పరం విరుద్దంగా ఉన్నాయని తెలిపింది. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు వేయడమేంటని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంటి కరప్షన్ కౌన్సిల్ ఎక్కడిదని ధర్మాసనం ప్రశ్నించింది. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 1, 2020 / 03:39 PM IST
    Follow us on

    ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తన పదవి నుంచి తొలగించాలని సుప్రీంలోవేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. మంగళవారం జీఎస్మణి దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన జస్టిస్ సంజయ్ కౌల్ పిటిషనర్ కోరుతున్న డిమాండ్ సహేతుకంగా లేదని చెప్పారు. పిటిషన్ లో లేవనెత్తిన అంశాలు సరిగ్గా లేవని పరస్పరం విరుద్దంగా ఉన్నాయని తెలిపింది. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు వేయడమేంటని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంటి కరప్షన్ కౌన్సిల్ ఎక్కడిదని ధర్మాసనం ప్రశ్నించింది. లేఖపై ఎంతమంది జోక్యం చేసుకుంటారని ప్రశ్నించింది.