https://oktelugu.com/

కలెక్టర్ తో బాలయ్య బాబు లవ్ స్టోరీ !

కొంతమంది హీరోయిన్లకు అన్ని ఉంటాయి.. కానీ అదృష్టమే కలిసిరాదు. సక్సెస్ కోసం మొత్తం గ్లామర్ ను గుప్పించినా.. చివరకు చిన్నాచితకా సినిమాలకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. లేకపోతే అందం, అభినయం అన్ని ఉన్నా.. అవకాశాలు కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేయాల్సిన ఖర్మ ఏమిటి ? ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. టాల్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్. ఈ మధ్య ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో గ్లామర్ ఫోటోలు పెట్టి ఫాలోయింగ్ […]

Written By:
  • admin
  • , Updated On : December 1, 2020 / 03:44 PM IST
    Follow us on


    కొంతమంది హీరోయిన్లకు అన్ని ఉంటాయి.. కానీ అదృష్టమే కలిసిరాదు. సక్సెస్ కోసం మొత్తం గ్లామర్ ను గుప్పించినా.. చివరకు చిన్నాచితకా సినిమాలకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. లేకపోతే అందం, అభినయం అన్ని ఉన్నా.. అవకాశాలు కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేయాల్సిన ఖర్మ ఏమిటి ? ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. టాల్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్. ఈ మధ్య ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో గ్లామర్ ఫోటోలు పెట్టి ఫాలోయింగ్ పెంచుకుంటూ ఛాన్స్ లు కోసం ఎదురుచూస్తూ ఉంది. ‘కంచె’ సినిమాతో మొదట మంచి క్రేజ్ తో మొదలైన ప్రగ్య జర్నీ.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది.

    Also Read: ప్రజలకు మన స్టార్ హీరోల పిలుపు

    ఐతే ఆమెకు ఇక అవకాశాలు రావడం కష్టమే అనుకున్న తరుణంలో మొత్తానికి బాలయ్య బాబు సినిమా దక్కింది. నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న బోయపాటి శ్రీను చిత్రంలో ప్రగ్య మెయిన్ హీరోయిన్.. మొదట కొత్త హీరోయిన్ అనుకున్నా.. ఎందుకో బోయపాటి ప్రగ్య వైపే మొగ్గు చూపాడు. అలాగే మరో భామగా పూర్ణ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ పాత్ర పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఎక్కువుగా గ్లామర్ రోల్స్ లో అలరించే ప్రగ్య ఈ సినిమాలో మాత్రం యంగ్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తుందట. మరి ప్రగ్య కలెక్టర్ అంటే బాగానే ఆసక్తి ఉంటుంది.

    Also Read: రాజమౌళియా మాజాకా? యాక్షన్ సీన్ కోసం అన్ని రోజులా?

    ఇక “సర్రైనోడు” సినిమాలో క్యాథెరిన్ ని ఎమ్మెల్యేగా చూపించిన బోయపాటి, ఈ సినిమాలో ప్రగ్యని కలెక్టర్ గా చూపించబోతున్నాడు. కాకపోతే బాలయ్య బాబు కలెక్టర్ తో లవ్ స్టోరీ నడపటం అంటే.. కాస్త ఆలోచించాల్సిందే.. దీనికితోడు బాలయ్య – ప్రగ్య జోడి ఎలా ఉంటుందో కూడా తెరపైనే చూడాలి. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ప్రగ్యా వచ్చే వారం నుండి షూట్ లో జాయిన్ అవ్వనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్