
కరోనా కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాజిటివ్ రేటు పెరుగుతూనే ఉంది. దీంతో కొందరు ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీకి కరోనా నిర్దారణ అయింది. నిన్న ఆయనకు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో సోమవారం వచ్చిన ఫలితాల్లో ఆయనకు పాజిటివ్ నిర్దారణ అయింది. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం మాంఝీ ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. హిందుస్థానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం) అధినేత ఆయిన జీతన్ రాం నిన్న తన ఇంట్లో జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ మధ్య తనతో సన్నిహితంగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు వస్తే టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.