
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ మేఘాలయ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. తనకు కరోనా వైరస్ పరీక్షలు చేసినట్లు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా శుక్రవారం ప్రకటించారు. తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. తాను తేలికపాటి కరోనా లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు సీఎం కాన్రాడ్ పేర్కొన్నారు.