
కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు కొత్త స్ట్రెయిన్ వైరస్‌పై పనిచేయవని ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ స్ట్రెయిన్‌పై కూడా పనిచేస్తుందని భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయ్ రాఘవన్ తెలిపారు. అయితే.. తొలుత ఎదుర్కొన్న కరోనా వైరస్‌తో పోల్చితే కరోనా స్ట్రెయిన్ ఇతరులకు వేగంగా సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా మార్పు చెంది స్ట్రెయిన్‌గా మారిన్పటికీ, ఆ వైరస్ కేవలం మనిషి రోగనిరోధక శక్తిని మాత్రమే తగ్గించగలదని.. వ్యాక్సిన్ పనిచేయకుండా చేయగలిగే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. అయితే.. వైరస్ మార్పు చెందుతున్న ఈ తరుణంలో మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరించారు.