దేశంలో చాలామంది బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బరువు తగ్గడం కోసం డైట్ లో మార్పులు చేసుకుంటూ ఉంటారు. మరి కొందరు బరువు తగ్గడానికి ఉపవాసం చేస్తుంటారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎక్కువగా బరువు తక్కువగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బరువు తగ్గుతామని భావిస్తూ ఉంటారు. కానీ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం బ్రేక్ ఫాస్ట్ తింటే మాత్రమే సులభంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు.
Also Read: ఆలస్యంగా డిన్నర్ చేస్తున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్..?
జర్మనీ దేశానికి చెందిన చేసిన పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. శాస్త్రవేత్తలు మొత్తం 16 మందిపై పరిశోధనలు చేయగా వారిలో సగం మందికి ఒక రకమైన ఆహారం, మిగిలిన సగం మందికి మరో రకం ఆహారం ఇచ్చారు. మొదటి సగం మందికి ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం ఉదయంఇస్తే.. మిగిలిన సగం మందికి అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని రాత్రి సమయంలో ఇచ్చారు. వారం రోజులు ఇలా ఆహారం ఇచ్చిన తరువాత కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చారు.
Also Read: సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
ఆ తరువాత మళ్లీ వారం రోజులు గ్యాప్ ఇచ్చి శాస్త్రవేత్తలు అదే విధమైన ఆహారాన్ని ఇచ్చారు. ఉదయం అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్న వారిలో మెటబాలిజం పెరగగా రాత్రి అధిక కేలరీలు ఉన్న ఆహారం ఆహారం తీసుకుంటే మెటబాలిజం తగ్గిందని తేలింది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే బరువు తగ్గుతామని అనుకోవడం అపోహేనని.. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
23 సంవత్సరాల వయస్సు ఉన్నవారిపై శాస్త్రవేత్తలు ఈ తరహా పరిశోధనలు చేశారు. ఫలితంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే బరువు పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.