కేకలు వేసిన పిల్లోడు.. అభినందించిన ఎమ్మెల్యే..! విషయమెంటీ?

ప్రజాప్రతినిధులు ఉండేది ప్రజలకు సేవ చేసేందుకే. అయినా వారితో పనులు చేయించుకోవాలంటే మాత్రం ప్రతీఒక్కరికి భయమే. సమస్యలపై వారిని నిలదీస్తే ఎక్కడ వాళ్లు తమపై కక్ష సాధింపు చేస్తారోమోననీ ప్రజలు భయపడుతుంటారు. అయితే దీనికి భిన్నంగా ఓ చిన్న పిల్లోడు చేసిన పని ఇప్పుడు అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Also Read: పిల్లలు లేకపోవడానికి కారణమదే.. నా ఆస్తులన్నీ వారికే: విజయశాంతి పెద్దవాళ్లు సైతం తమకెందుకులే అని వదిలేసిన స్థానిక సమస్యను ఓ పదేళ్ల కుర్రాడు ఎమ్మెల్యే […]

Written By: Neelambaram, Updated On : December 18, 2020 5:54 pm
Follow us on

ప్రజాప్రతినిధులు ఉండేది ప్రజలకు సేవ చేసేందుకే. అయినా వారితో పనులు చేయించుకోవాలంటే మాత్రం ప్రతీఒక్కరికి భయమే. సమస్యలపై వారిని నిలదీస్తే ఎక్కడ వాళ్లు తమపై కక్ష సాధింపు చేస్తారోమోననీ ప్రజలు భయపడుతుంటారు. అయితే దీనికి భిన్నంగా ఓ చిన్న పిల్లోడు చేసిన పని ఇప్పుడు అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read: పిల్లలు లేకపోవడానికి కారణమదే.. నా ఆస్తులన్నీ వారికే: విజయశాంతి

పెద్దవాళ్లు సైతం తమకెందుకులే అని వదిలేసిన స్థానిక సమస్యను ఓ పదేళ్ల కుర్రాడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే సైతం ఆ చిన్నారి మెచ్చుకొని ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించాడు. దీంతో ఈ చిన్నోడు చేసిన పనిని ప్రతీఒక్కరూ అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో చేపడుతున్న మిషన్ భగీరథ నీటి పనులు ప్రారంభించేందుకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యే వచ్చినంతనే స్థానిక ప్రజాప్రతినిధులు.. అధికారులంతా ఆయన చుట్టూ చేరి స్వాగతం పలుకే ఏర్పాట్లు చేశారు.

Also Read: టెన్త్ కుదింపు: తెలంగాణలో స్కూళ్లు తెరిచేది అప్పుడే..

అయితే ఓ పదేళ్ల కుర్రాడు యశ్వంత్ మాత్రం తమ కాలనీకి రోడ్డు వేయాలంటూ పెద్దగా కేకలు వేశాడు. దీంతో ఎమ్మెల్యే పిల్లోడిని దగ్గరకు తీసుకొని సమస్యను అడిగి తెలుసుకున్నాడు. ఎమ్మెల్యేకు సైతం ఆ చిన్నోడు తమ కాలనీకి రోడ్డు వేయించాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాడు.

యశ్వంత్ చొరవతో వారి కాలనీకి రోడ్డు రానుండటంతో కాలనీ వాసులు చిన్నారిని అభినందనలతో ముంచెత్తారు. చిన్నతనంలోనే సామాజిక అంశాలు.. ఊరి కోసం ప్రశ్నించేతత్వం ఉండటాన్ని చూసి అతడిని ప్రతీఒక్కరు అభినందిస్తున్నారు. అలాగే ఓ చిన్నారి చెప్పిన సమస్యను ఆసాంతంవిని పరిష్కరించిన ఎమ్మెల్యేపై సైతం ప్రశంసలవర్షం కురుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్