
ప్రపంచంలో కాశ్మీర్ కుంకుమ పువ్వు విశిష్టమైనదని,దేశ ప్రజలు దీనినే వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల్లో లభించే కుంకుమ పువ్వు కంటే కాశ్మీర్ లోని కుంకుమ పువ్వు నాణ్యతమైనదని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో కాశ్మీర్ కుంకుమ పువ్వుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఈ ఏడాది వచ్చిందని, ఆ తరువాత దీనికి అంతర్జాతీయ మార్కెట్లో న్యాయమైన స్థానం లభించిందన్నారు.