https://oktelugu.com/

ఎన్టీఆర్ షూ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

ప్రముఖుల వేషధారణ మీద సాధారణ ప్రజలలో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అభిమాన హీరో, హీరోయిన్, క్రికెటర్ లు ఎప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్తో ఉన్నారు, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నారు, వారు ధరించిన వాచెస్, చెప్పులు, హ్యాండ్ బాగ్స్ వంటి వాటి గురించి ఎప్పుడూ మనిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సెలెబ్రెటీస్ ధరించే వాటి విలువ బయటకి తెలిసి అందరూ షాక్ అవటం విదితమే. ‘గబ్బర్ సింగ్ ‘ సినిమాలో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు కొన్ని కోట్లు […]

Written By:
  • admin
  • , Updated On : December 27, 2020 / 02:36 PM IST
    Follow us on


    ప్రముఖుల వేషధారణ మీద సాధారణ ప్రజలలో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అభిమాన హీరో, హీరోయిన్, క్రికెటర్ లు ఎప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్తో ఉన్నారు, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నారు, వారు ధరించిన వాచెస్, చెప్పులు, హ్యాండ్ బాగ్స్ వంటి వాటి గురించి ఎప్పుడూ మనిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సెలెబ్రెటీస్ ధరించే వాటి విలువ బయటకి తెలిసి అందరూ షాక్ అవటం విదితమే. ‘గబ్బర్ సింగ్ ‘ సినిమాలో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు కొన్ని కోట్లు ఉంటుందని తెలిసాక ధన్ రాజ్,వేణు ఎలా షాక్ అవుతారో అలాగే సాధారణ అభిమానులు కూడా నిజ జీవితంలో షాక్ అవుతారు.

    Also Read: హనీమూన్ కోసం ‘నిహారిక’ జంట.. !

    సినీ ప్రపంచంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు బ్రాండెడ్ వస్తువులను ఎక్కువగా వాడుతుంటారు. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ధర వేలలో ఉంటుంది. చిరంజీవి ధరించే వాచ్ ఖరీదుతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సంవత్సరం బ్రతకగలరు. ఇటీవల రౌడీ విజయ దేవరకొండ వేసుకున్న చెప్పులు ఖరీదు తెలిసి అభిమానులు బిత్తరపోయారు. అలానే ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ షూస్ కు సంబంధించిన న్యూస్ ట్రేండింగ్ లో ఉంది. ఎన్టీఆర్ వేసుకున్న షూ ఖరీదు తెలిసి ఫ్యాన్స్ తో పాటుగా రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అవాక్కవుతున్నారట.

    ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా బయట కూడా స్టైలింగ్ కు ప్రాధాన్యత ఇస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఒక పెళ్లికి హాజరైన సమయంలో ఎన్టీఆర్ 30 లక్షల రూపాయల వాచ్ ధరించిన ఫోటోలు తెగ వైరల్ కావడం తెలిసిందే. ఇటీవల ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ హెమ్స్ (HERMES) కెంపెనీకి సంబంధించిన షూస్ ధరించ ఉన్నఫోటోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతన్నాయి.

    Also Read: బిగ్ బాస్ తో రహస్య ఒప్పందం వల్లే మోనాల్ కి ఛాన్స్ !

    తమ అభిమాన కథానాయకుడు వంటి మీద ఉన్న ప్రతి వస్తువు గురించి అభిమానులు ప్రత్యేక దృష్టి పెట్టి వాటి గురించి అంతర్జాలంలో వెతికేస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ వాడుతున్న షూస్ ఖరీదు అక్షరాలా 80వేలకు పైనే అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువగా మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా లక్షలు వెచ్చించి డ్రెసెస్, వాచెస్ కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ వరుసలో నిలిచారు. మా హీరో రేంజ్ కి తగ్గట్టుగానే షూస్ రేంజ్ ఉన్నాయని అభిమానులు చర్చిస్తున్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్