రాజ్యసభ ఎన్నికలు: బీఎస్పీపై 6గురు ఎమ్మెల్యేల తిరుగుబాటు
ఉత్తరప్రదేశ్ 10 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ తరుపున మాయావతి తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో సొంత బలం లేకుండా ఇతర పార్టీల మద్దతుతో గెలవాలని పార్టీ నాయకులను పోటీలో నిలిపింది. అయితే 6గురు ఎమ్మెల్యేలు మాయావతి బరిలో ఉంచిన అభ్యర్థికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌జీ గౌతం నామినేషన్ పత్రాలపై తాము సంతకాలు పెట్టలేదని, అవి ఫోర్జరీ చేశారని 6గురు ఎమ్మెల్యేలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. […]
Written By:
, Updated On : October 29, 2020 / 08:57 AM IST

ఉత్తరప్రదేశ్ 10 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ తరుపున మాయావతి తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో సొంత బలం లేకుండా ఇతర పార్టీల మద్దతుతో గెలవాలని పార్టీ నాయకులను పోటీలో నిలిపింది. అయితే 6గురు ఎమ్మెల్యేలు మాయావతి బరిలో ఉంచిన అభ్యర్థికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌జీ గౌతం నామినేషన్ పత్రాలపై తాము సంతకాలు పెట్టలేదని, అవి ఫోర్జరీ చేశారని 6గురు ఎమ్మెల్యేలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో యామావతి ఆందోళనలో పడ్డారు.