https://oktelugu.com/

మనాలిలో నాగార్జున.. ఈ వారం బిగ్ బాస్ హోస్ట్‌ ఎవరు..?

సమంత.. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌. అంతకుమించి అక్కినేని వారి ఇంటి కోడలు. ఓ వైపు సినిమాల్లో చేస్తూనే.. మరోవైపు తన మామ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్‌ షోలోనూ తళుక్కున మెరిసింది. మామ స్థానంలోకి కోడలు వచ్చింది. అంతేకాదు.. మొదటి వారంతోనే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. నాన్‌స్టాప్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులకు దసరా సంబరాన్ని అందించింది. Also Read: దయచేసి పార్టీ అడగొద్దంటున్న కాజల్ ఇంతవరకు బాగానే ఉన్నా.. మరి రాబోయే వీకెండ్‌ పరిస్థితి ఏంటా అని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 08:44 AM IST
    Follow us on

    సమంత.. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌. అంతకుమించి అక్కినేని వారి ఇంటి కోడలు. ఓ వైపు సినిమాల్లో చేస్తూనే.. మరోవైపు తన మామ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్‌ షోలోనూ తళుక్కున మెరిసింది. మామ స్థానంలోకి కోడలు వచ్చింది. అంతేకాదు.. మొదటి వారంతోనే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. నాన్‌స్టాప్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులకు దసరా సంబరాన్ని అందించింది.

    Also Read: దయచేసి పార్టీ అడగొద్దంటున్న కాజల్

    ఇంతవరకు బాగానే ఉన్నా.. మరి రాబోయే వీకెండ్‌ పరిస్థితి ఏంటా అని ఇప్పుడు బిగ్‌బాస్‌ అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ఈ శని, ఆదివారాల్లోనూ సమంతానే వస్తుందా లేక నాగార్జున వచ్చి హోస్ట్‌ చేస్తారా అనేది తెలియకుండా ఉంది.

    బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ షూట్‌ కోసం మనాలీ వెళ్లాడు. అది ఒక్క వారంతో అయిపోయే షూట్ కాదు. 21 రోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందని స్వయంగా నాగార్జునే చెప్పాడు. మరి అలాంటప్పుడు ఈ వారాంతం బిగ్ బాస్ షోకు నాగార్జున వస్తాడా లేక మరోసారి సమంతతోనే మేనేజ్ చేస్తారా తెలియకుండా ఉంది.

    Also Read: మహేష్ పెట్టుడు మీసం మీద కామెంట్ చేసిన నమ్రత

    ఫైనల్‌గా వినిపిస్తున్న మరో మాట ఏంటంటే.. ఈ వారం నాగార్జునే వస్తారని. గతవారం వాతావరణం అనుకూలించక చివరి నిమిషంలో సమంతను ప్రవేశపెట్టారట. ఈ వారం మాత్రం నాగార్జునే ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వచ్చి బిగ్‌బాస్‌ షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ షూట్‌ అయిపోగానే తిరిగి మనాలీ చేరుకుంటారని సమాచారం.