ఆస్ట్రేలియాతో టీమిండియా జరిగే బాక్సింగ్ టెస్టుకు సంబంధించిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ లో ఇదివరకు జరిగిన మొదటి టెస్టులో ఉన్న జట్టు సభ్యుల సంఖ్యలో బీసీసీఐ మార్పులు చేసింది. వీరిలో ప్రుథ్విషా స్థానంలో షుబ్మాన్ గిల్, విరాట్ కోహ్లి స్థానంలో రవీంద్ర జడేజా, వ్రుద్ధిమాన్ సాహా స్థానంలో రిషబ్ పంత్, మహ్మద్ షమీ తరుపున మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు. మిగతా రహనే, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పూజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ వారి స్థానాల్లోనే ఉన్నారు. అజింక్య రహనే నే కెప్టెన్ గా రెండో టెస్టు సాగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విరాట్ కోహ్లీ లేకపోవడంతో జట్టు పటిష్టం కోసం మార్పులు చేశామన్నారు. కేవలం ఓపెనర్లపైనే ఆధారపడకుండా ప్రతీ బ్యాట్మెన్ కీలక పాత్ర పోషించేలా మార్పులు చేశామన్నారు.
జట్టు సభ్యులు
మయాంక్ అగర్వాల్, సుభ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహనే(కెప్టెన్), హనుమ విహారి,రిషబ్ పంత్ (వికెట్ కీపర్), బుమ్రా, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్.అశ్విన్, మోహద్, సిరాజ్.
ALERT🚨: #TeamIndia for 2nd Test of the Border-Gavaskar Trophy against Australia to be played in MCG from tomorrow announced. #AUSvIND pic.twitter.com/4g1q3DJmm7
— BCCI (@BCCI) December 25, 2020