పోలీసుల అదుపులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జగిత్యాలలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్పంచ్ లు కార్యకర్తలు ఆయన పర్యటనను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మద్దతు పలికారు. వారితో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు […]

Written By: Suresh, Updated On : December 25, 2020 12:25 pm
Follow us on

టీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జగిత్యాలలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్పంచ్ లు కార్యకర్తలు ఆయన పర్యటనను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మద్దతు పలికారు. వారితో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు టీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా అక్కడే ఉన్న ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తంగా మరే పరిస్థితులు కనిపించడంతో ఎమ్మెల్యేను కూడా అదుపులోకి తీసుకున్నారు.