మోడి సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓటమి

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పరాభావం ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లోని 11 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 9 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 4 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ప్రధాని సొంత నియోజకవర్గమైన వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ […]

Written By: Velishala Suresh, Updated On : December 6, 2020 1:02 pm
Follow us on

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పరాభావం ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లోని 11 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 9 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 4 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ప్రధాని సొంత నియోజకవర్గమైన వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ గెలుపొందడంపై సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి మరో రెండు స్థానాల్లో ఫలితాలు వెలువడాలి.