Homeఅంతర్జాతీయంSaudi Arabia Air Defense Intercepts Iran Missiles: సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ యాక్టివేట్‌.. ఇరాన్‌...

Saudi Arabia Air Defense Intercepts Iran Missiles: సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ యాక్టివేట్‌.. ఇరాన్‌ క్షిపణులు కూల్చివేత!

Saudi Arabia Air Defense Intercepts Iran Missiles: ఆవులు కొట్టుకుని లేగల మీద పడినట్లు.. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం గల్ఫ్‌ దేశాలను అతలాకుతలం చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి రోజే అమెరికా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెట్టింది. దీంతో ఇరాన్‌ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌తోపాటు, గల్ప్‌ దేశాలపై వైమానిక దాడులు చేస్తోంది. ఇప్పటికే సైదీ అరేబియా, సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, తుర్కియేపై క్షిపణులతో దాడి చేస్తోంది. దీంతో గల్ప్‌ దేశాల్లో ఆందోళన పెరిగింది. మరోవైపు ఆయిల్‌ ఉత్పత్తి, సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఇరాన్‌ దాడులతో ఇబ్బంది పడిన గల్ప్‌ దేశాలు ఇప్పుడు స్వీయ రక్షణ చర్యలు చేపట్టాయి.

Also Read: విజయ్–రష్మిక ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. సెట్ చేశారంతే

బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకున్న సౌదీ..
సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ వైమానిక స్థావరం వైపు ప్రయోగించిన ఇకారః మూడు బాలిస్టిక్‌ క్షిపణులను సౌదీ అరేబియా రక్షణ వ్యవస్థలు పూర్తిగా అడ్డుకుంది. అమెరికన్‌ బలగాల ఉన్న ప్రదేశాన్ని కాపాడాయి. ఈ ఘటన గల్ఫ్‌ ప్రాంతంలో యుద్ధ విస్తరణకు సంకేతంగా నిలుస్తోంది. ఈ చర్యతో సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.

సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టం యాక్టివ్‌..
రియాద్‌కు తూర్పున ఉన్న ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌ బేస్‌పై లక్ష్యంగా ఇరాన్‌ మూడు బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించింది. సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు వీటిని గుర్తించి నాశనం చేశాయి. ఈ స్థావరంలో అమెరికా సైనికులు ఉండటంతో దాడి వ్యూహాత్మక లక్ష్యంగా మారింది. ఎటువంటి నష్టాలు లేకుండా ఘటనా లొకేషన్‌ సురక్షితంగా ఉంది.

విస్తరిస్తున్న యుద్ధం..
ఇరాన్‌–అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం గల్ఫ్‌ దేశాలకు వ్యాప్తమైంది. సౌదీలో ఇది రెండోసారి జరిగిన దాడి. ఇంతకుముందు రియాద్‌ విమానాశ్రయం, రాస్‌ తానూరా ఆయిల్‌ రిఫైనరీలపై కూడా ఇరాన్‌ దాడులు జరిగాయి. యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్‌లలో కూడా క్షిపణులు, డ్రోన్‌ దాడులు ఎదుర్కొన్నాయి. ఈ దాడులు ప్రాంతీయ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి.

సౌదీ రక్షణ సామర్థ్యం
సౌదీ అరేబియా పేట్రియట్, థాడ్‌ వంటి అమెరికన్‌ వ్యవస్థలతోపాటు స్వీయ డ్రోన్‌ డిఫెన్స్‌ సాంకేతికతలను మోహరించింది. ఇవి ఇరాన్‌ క్షిపణులను అడ్డుకోవడం ద్వారా గల్ఫ్‌ దేశాల రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇరాన్‌ ప్రతీకార దాడులు పెరిగినా, గల్ఫ్‌ కూటమి ఐక్యత పెరుగుతోంది.

ఈ దాడి ఆయిల్‌ రవాణా మార్గాలు, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి పెంచుతోంది. సౌదీ ప్రకటన అమెరికా మిత్రత్వాన్ని బలపరిచింది. ఇరాన్‌ వ్యూహం గల్ఫ్‌ దేశాల్లో చీలికలు తీసుకురావడంలో విఫలమవుతోంది. యుద్ధం మరింత విస్తరిస్తే ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version