Homeఎంటర్టైన్మెంట్Sampardayini Suppini Suddapūsani Twitter Review: శివాజీ 'సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని' మూవీ ట్విట్టర్ టాక్...

Sampardayini Suppini Suddapūsani Twitter Review: శివాజీ ‘సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని’ మూవీ ట్విట్టర్ టాక్ ఇదే..ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు!

Sampardayini Suppini Suddapūsani Twitter Review: ఈమధ్య కాలం లో సీనియర్ హీరో శివాజీ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయిపోయాడు. హీరోయిన్స్ ధరించే దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ , ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎక్కడ వరకు దారి తీశాయో మనమంతా చూశాము . బిగ్ బాస్ ఆయన కొత్త జీవితాన్ని ఇస్తే, ఈ కాంట్రవర్సీ ఆయన్ని జనాలకు మరింత దగ్గర చేసింది. పైగా బిగ్ బాస్ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత చేసిన 90s , కోర్ట్ , దండోరా వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యి శివాజీని నటుడిగా వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఆయన చాలా కాలం తర్వాత హీరో గా నటిస్తూ ‘సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని’ అనే చిత్రం చేశాడు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే . సీనియర్ హీరోయిన్ లయ ఇందులో శివాజీ కి జోడీగా నటించింది. నేడు విడుదలైన ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.

ఈ సినిమా విడుదలకు ముందు ట్రైలర్ తో ప్రేక్షకులను మంచిగా ఆకట్టుకుంది. ఒక డిఫరెంట్ కథతో శివాజీ మన ముందుకు రాబోతున్నాడు, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టు ప్రొమోషన్స్ కూడా చాలా గట్టిగానే చేశారు. అలా మంచి పాజిటివ్ బజ్ తో నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాని చూసిన నెటిజెన్స్ , నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఆరంభం నుండి చివరి వరకు ఈ సినిమా థియేటర్స్ లో మా సహనాన్ని పరీక్షించింది అంటూ చెప్పుకొచ్చారు. పాత స్టోరీ లైన్ ని అవుట్ డేటెడ్ న్యారేషన్ తో డైరెక్టర్ చాలా చెత్తగా తీశాడని అంటున్నారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది కేవలం శివాజీ, లయ మధ్య ఉన్న కెమిస్ట్రీ మాత్రమే.

వీళ్లిద్దరు వెండితెర పై నిజమైన భార్యాభర్తలు లాగానే కనిపించారని , వాళ్ళని సెంటర్ చేసుకొని రాసిన కొన్ని జోక్స్ బాగానే పేలాయని అంటున్నారు. కానీ మిగిలిన సినిమా మొత్తం మన సహనానికి పరీక్ష అట. ముఖ్యంగా 90s వెబ్ సిరీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ రోషన్ క్యారెక్టర్ పెద్ద హిట్ అయ్యింది. ఆ బుడ్డోడి కామెడీ టైమింగ్ సిరీస్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. కానీ ఈ సినిమాలో రోషన్ క్యారక్టర్ ఆడియన్స్ కి చిరాకు కలిగించేలా ఉంటుందని అంటున్నారు. ఈ మాత్రం సినిమాకు శివాజీ డైరెక్ట్ ఓటీటీ విడుదల ని కూడా కాదని థియేటర్స్ లో విడుదల చేయడం ఏంటో, పాపం నిర్మాతగా ఈసారి భారీగానే నష్టపోతాడు అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version