https://oktelugu.com/

లవ్ జీహాదీపై అసెంబ్లీలో బిల్లు

లవ్ జీహాదీకి పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష పడేలా చట్టం తీసుకురానున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ తెలిపారు. త్వరలోనే ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతామన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం దేశంలో లవ్ జీహాదీ చెక్కర్లు కొడుతోందని, ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడుతామన్నారు. మత మార్పిడి చేయించినా, ఇష్టం లేని వివాహాలు చేయించినా వారిని విడిచి పెట్టేది లేదన్నారు. ఒకవేళ ఎవరైనా మతం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 17, 2020 / 03:20 PM IST
    Follow us on

    లవ్ జీహాదీకి పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష పడేలా చట్టం తీసుకురానున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ తెలిపారు. త్వరలోనే ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతామన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం దేశంలో లవ్ జీహాదీ చెక్కర్లు కొడుతోందని, ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడుతామన్నారు. మత మార్పిడి చేయించినా, ఇష్టం లేని వివాహాలు చేయించినా వారిని విడిచి పెట్టేది లేదన్నారు. ఒకవేళ ఎవరైనా మతం మార్చుకోవాలనుకుంటే నెలరోజుల ముందే కోర్టును సంప్రదించాలన్నారు.