బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ న్యాయవాది రఘునందన్ రావు చిక్కుల్లో పడ్డారు. కొద్దిరోజులుగా ఆయనను వెంటాడుతున్న ఓ మహిళా మంగళవారం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దుబ్బాక ఎన్నికల వేళ ఇదే మహిళా నియోజకవర్గంలో పర్యటించి రఘునందన్ రావుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదంతోనే తాజాగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు తెలిసింది.
Also Read: వాహ్.. కేసీఆర్ మార్క్ షెడ్యూల్.!
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును ఎమ్మెల్యే కాకముందే న్యాయవాది అయిన ఆయన ఇంటికి ఓ కేసు విషయమై తాను ఆశ్రయించగా కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేశాడంటూ రాజారమణి అనే మహిళ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. మానహక్కుల సంఘాన్ని ఆమె అప్పట్లో ఆశ్రయించారు. తనకు న్యాయం జరగడం లేదని ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది.
రాజా రమణి అనే మహిళ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు సమాచారం. రఘునందన్ తోపాటు పలువురు పోలీసులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలపై రగడ..ఈసీకి బీజేపీ ఫిర్యాదు
అత్యాచారం కేసులో న్యాయం జరగలేదని.. 20 ఏళ్లుగా తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆమె వాపోయారు. వేధింపులకు గురిచేస్తున్న అధికారులు, ఎమ్మెల్యే రఘునందన్, ఆర్సీపురం పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కోరారని మీడియా తెలిపింది. న్యాయం జరగడం లేదనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె చెప్పినట్లు అందులో పేర్కొన్నారు.
రాజారమణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆమెను ఆర్సీపురం పోలీసులు పటాన్ చెరులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి ఇంటికి పంపించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలిసింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్