ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం: నిమ్మగడ్డ రమేశ్

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల మిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుతున్నందున ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు నిర్వహించే నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని అధికారులు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని, రాజ్యాంగ […]

Written By: Suresh, Updated On : November 17, 2020 3:08 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల మిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుతున్నందున ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు నిర్వహించే నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని అధికారులు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని, రాజ్యాంగ పరమైన అంశాలను పూర్తి చేసి ఎన్నికల ప్రక్రియకు వెళ్తామన్నారు.