
బీహార్ రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. 94 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. అధికారులు కరోనా జాగ్రత్తలను తీసుకుంటూ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు అనుమతినిస్తున్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన తల్లి మాజీ సీఎం రబ్రీదేవీతో సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దిఘాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నితీశ్‌కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాట్నాలో తేజస్వీ ఆయన తల్లి పోలింగ్‌లో పాల్గొన్నారు. జేఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు, సీపీఐ నేత కన్హయ్య బెగూసరాయ్‌లో ఓటేశారు.