నామా’కు నామాలు.. టీఆర్ఎస్ లో డమ్మీ అయ్యారా?

తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నామా నాగేశ్వర్‌రావు ఆ తరువాత టీఆర్‌ఎస్‌లోకి మారారు. టీడీపీ నుంచి చివరి సారిగా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న నామాకు కేసీఆర్‌ ప్రాధాన్యం ఎక్కువగానే ఇచ్చారు. ఎంపీగా గెలిచిన ఆయనకు పార్లమెంటరీ పొలిట్‌బ్యూరో బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ కోసం కూడా తీవ్రంగానే పోరాడుతున్నాడు. పార్లమెంట్‌ సమావేశాల్లో నామా తనదైన శైలిలో ప్రసంగిస్తూ వ్యవహరిస్తున్నాడు. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ అయితే నామా నాగేశ్వర్‌రావు […]

Written By: NARESH, Updated On : November 3, 2020 4:55 pm
Follow us on

తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నామా నాగేశ్వర్‌రావు ఆ తరువాత టీఆర్‌ఎస్‌లోకి మారారు. టీడీపీ నుంచి చివరి సారిగా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న నామాకు కేసీఆర్‌ ప్రాధాన్యం ఎక్కువగానే ఇచ్చారు. ఎంపీగా గెలిచిన ఆయనకు పార్లమెంటరీ పొలిట్‌బ్యూరో బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ కోసం కూడా తీవ్రంగానే పోరాడుతున్నాడు. పార్లమెంట్‌ సమావేశాల్లో నామా తనదైన శైలిలో ప్రసంగిస్తూ వ్యవహరిస్తున్నాడు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

అయితే నామా నాగేశ్వర్‌రావు సొంత జిల్లా ఖమంలో మాత్రం పరాభావం ఎదురవుతోంది. కొన్ని అధికారిక కార్యక్రమాల్లో ఎంపీని పట్టించుకోవడం లేదనే చర్చ సాగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు ఎంపీ పేరు లేకుండా నడిపిస్తున్నారని, ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు అధికారులు డుమ్మా కొడుతున్నారని రకరకాలుగా అనుకుంటున్నారు. ఎంపీగా నిధులు విడుదల చేస్తానని అని నామా ప్రత్యేకంగా చెబతున్నా ఆయనను పట్టించుకోవడం లేదంటున్నారు.

Also Read: ఒక్కరోజు జీతం : భగ్గుమంటున్న తెలంగాణ ఉద్యోగులు?

ఈ పరిణామాలపై విసుగు చెందిన నామా పై అధికారులకు కూడా ఫిర్యాదు చేశారట. ఇటీవల దిశ కార్యక్రమంలో నిర్వహించిన సమావేశంలో అధికారులు మీడియాకు సైతం సమాచారం ఇవ్వలేదు. దీంతో ఎంపీ నామా అనుచరులు మీడియా మిత్రులను పిలిచి వారికి వివరాలు అందిచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మరి కొన్ని కార్యక్రమాల్లో నామా పేరును ఉచ్చరించడానికి కూడా అధికారులు ఇష్టపడడం లేదట. ఆయన పేరు వాడకుండానే కార్యక్రమాలు ముగించేస్తున్నారు.

Also Read: దుబ్బాక ఎన్నిక: రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందా..

ఖమ్మం జిల్లాకే చెందిన ఓ టీఆర్‌ఎస్‌ నేతతోనే ఇలా జరగుతోందని అనుకుంటున్నారు. పార్టీ అధిష్టానంతో అనుయాయునిగా ఉంటున్న ఆ నేత మొదటి నుంచి ఎంపీకి వ్యతిరేకంగానే ఉంటున్నట్లు సమాచారం. ఆయన మాటకు భయపడి అధికారులు ఈ రకంగా నడుచుకుంటున్నారని అంటున్నారు. అయితే చివరి ఈ వివాదం ఏ వైపుకు దారి తీస్తుందోనని పార్టీలోని నాయకులు చర్చించుకుంటున్నారు.